Aug 09,2022 20:43

ప్రక్రియ వేగవంతం
మంత్రి పియూష్‌ గోయల్‌
న్యూఢిల్లీ  : 
 బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్యం ప్రతిపాదిత ఒప్పంద ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్  గోయల్‌ అన్నారు.  దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడులు,  వాణిజ్యం పెరగనున్నాయన్నారు.  యుఇఎతో రికార్డ్‌ సమయంలో భారత్‌ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందన్నారు.  ఇప్పుడు బ్రిటన్‌తో చర్చలు జరుపుతున్నామన్నారు. ప్రస్తుత ఏడాది జనవరిలో దీనికి సంబందించిన ప్రతిపాదిత ప్రక్రియ ప్రారంభమైంది. దీపావళి కల్లా పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే క్రమంలో కెనడా, పలు యూరోపియన్‌ దేశాలతోనూ చర్చలు జరుపుతున్నామని గోయల్‌ వెల్లడించారు. పలు దేశాలు భారత్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నాయన్నారు.