May 29,2023 21:40

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ పురుషుల సింగిల్స్‌లో 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత, 3వ సీడ్‌, సెర్బియాకు చెందిన నొవాక్‌ జకోవిచ్‌ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో జకోవిచ్‌ 6-3, 6-2, 7-6(7-1)తో అలెగ్జాండర్‌(అమెరికా)పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్‌లను సునాయాసంగా గెలిచిన జకోవిచ్‌కు.. మూడో సెట్‌లో అనూహ్య ప్రత్యర్ధినుంచి ప్రతిఘటన ఎదురైంది. ఆ సెట్‌ను టైబ్రేక్‌లో ముగించి జకోవిచ్‌ రెండోరౌండ్‌లోకి ప్రవేశించాడు. ఇతర పోటీల్లో 14వ సీడ్‌ నొర్రి(బ్రిటన్‌) 7-5, 4-6, 3-6, 6-1, 6-4తో బెనోయిట్‌(ఫ్రాన్స్‌)పై ఐదుసెట్ల హోరాహోరీ పోరులో గెలుపొందగా.. మరో పోటీలో ఫాబియో ఫోగ్నిని(ఇటలీ) 6-4, 6-4, 6-3 తేడాతో ఫిలెక్స్‌ అగర్‌(కెనడా)పై, 26వ సీడ్‌ డేనిస్‌ షపొవలోవ్‌(కెనడా) 6-4, 7-5, 4-6, 3-6, 6-3తో బ్రండన్‌(అమెరికా)పై గెలిచారు. మరో పోటీలో డి-మానర్‌(ఆస్ట్రేలియా) 6-1, 5-7, 6-1, 6-3తో ఇవాష్కా(రష్యా)పై గెలిచి ముందుకు దూసుకెళ్లారు.