Sep 30,2022 12:19

ప్రజాశక్తి - పెనుమంట్ర (పశ్చిమ గోదావరి) : ఫ్రైడే-డ్రైడే సందర్భంగా ... శుక్రవారం పెనుమంట్ర పంచాయతి కార్యాలయం వద్ద ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దోమల ద్వారా వచ్చే మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీ కార్యదర్శి వివి నారాయణ అన్నారు. దోమలను లావ దశలో నిర్మూలించాలని, నీటి నిల్వ లేకుండా చూడాలని, వాడిన ప్లాస్టిక్‌ వస్తువులను దూరంగా పారవేయాలని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం కే.భాగ్యకుమారి, ఆశా వర్కర్లు ఎన్‌.సంతోషి, ఎన్‌.సత్యవేణి, వాలంటీర్లు పాల్గొన్నారు.