Jun 02,2023 08:45

హాయ్ ఫ్రెండ్స్‌! నా పేరు సాత్విక్‌. నాలుగో తరగతి చదువుతున్నా. మాది నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్‌ నగర్‌. వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ గారి ఊరు అయిన నెల్లూరు జిల్లా కోవూరు మండలం చెర్లోపల్లి గ్రామం వెళ్లా. అక్కడ చుట్టు పక్కల కొంతమంది పిల్లలు ఉన్నారు. నేను ఎప్పుడు అక్కడకు వెళ్లినా వాళ్లతో ఆడుకుంటా. దాంతో నాకు స్నేహితులయ్యారు. వాళ్లతో ఊరంతా సరదాగా తిరిగేవాళ్లం. మా తాత రైతు. ప్రతిరోజూ పొలానికి వెళతాడు. వరి సాగు చేస్తున్నాడు. నేనూ ఆయనతో కలిసి పొలానికి వెళ్లేవాడిని. తాత వెంటే తిరుగుతూ నా చేతనైన సాయం చేసేవాడిని. స్నేహితులతో పాటు ప్రతిరోజూ సాయంత్రం పూట మా పొలంలో ఉన్న మోటర్‌ షెడ్‌కు వెళ్లేవాళ్లం. అక్కడ పైపులో నుంచి చల్లటి నీళ్లు వస్తూ ఉంటే మేమంతా సరదాగా స్నానం చేసేవాళ్లం. కేరింతలు కొట్టేవాళ్లం. అప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. మరీ ఇక ఆలస్యంమెందుకు మీరు కూడా సరదాగా గడిపిన రోజులు వేసవి విడిదితో పంచుకోండి.

కత్తి. సాత్విక్‌,

- కత్తి. సాత్విక్‌,
4వ తరగతి, ఎన్టీఆర్‌ నగర్‌, నెల్లూరు జిల్లా.