Nov 26,2022 08:17

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రస్తుత ఏడాదిలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు చెల్లించాల్సిన జిఎస్‌టి పరిహార నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆర్ధిక శాఖ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మొత్తంగా రూ.17వేల కోట్ల పరిహార నిధులను విడుదల చేసింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు జిఎస్‌టి పరిహారం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.682 కోట్లు, తెలంగాణకు రూ.542 కోట్లు విడుదల చేసినట్లు ఆర్ధిక శాఖ ప్రకటించింది.