Jul 01,2022 14:56

ప్రజాశక్తి - విశాఖపట్నం : డాక్టర్స్‌ డే సందర్భంగా ప్రజాశక్తి రూపొందించిన ప్రత్యేక సంచికను రెడ్‌ క్రాస్‌ సొసైటీ హాల్‌లో జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి లక్ష్మి షా ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ... ఈ కార్యక్రమానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తాను కూడా డాక్టర్‌ అవ్వాలనుకున్నానని కొన్ని అనుకోని కారణాల ద్వారా అవ్వలేకపోయానని తెలిపారు. కరోనా సమయంలో డాక్టర్లంతా ముఖ్యభూమికి పోషించారని కొనియాడారు. జీవీఎంసీ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రజాశక్తి ద్వారా ప్రశంసా పత్రాలను, బ్యాగ్‌, డిక్షనరీ నోట్‌ బుక్స్‌తో కూడిన కిట్లను ఆయన బహుకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విద్యార్థులలో ఎక్కువ మంది డాక్టర్లు కావాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. నగరంలో ప్లాస్టిక్‌ వాడకం తగ్గించి నగరాన్ని కాపాడాలని కోరారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ చైర్మన్‌ శివ నాగేంద్ర రెడ్డిని సన్మానించారు. మరో అతిథి కళ హాస్పిటల్‌ అధినేత రమణమూర్తి మాట్లాడుతూ ప్రజాశక్తి అంటే క్రమశిక్షణ కలిగిన సంస్థని దానిని అదే విధంగా కొనసాగించాలని వారికి కళా హాస్పిటల్‌ తరుపున ఎల్లప్పుడూ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. జీవీఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ శాస్త్రి మాట్లాడుతూ ప్రజాశక్తి ఎల్లప్పుడూ విద్యార్థులను ప్రోత్సహిస్తుందని ఈ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. అనంతరం కరోనా కారణంగా మృతి చెందిన డాక్టర్‌ వేణు గోపాల్‌ను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ కే సరిత సురేష్‌ శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నర్సింగరావు చేతుల మీదుగా సరిత సురేష్‌, శాస్త్రి ,రమణమూర్తి లకు జ్ఞాపకాలు అందజేశారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం చైర్మన్‌ సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ రెడ్‌ క్రాస్‌ సంస్థతో కలిసి ఎప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించమని, డాక్టర్‌ సరిత సురేష్‌ ఎన్నో సేవలు అందిస్తున్నారని అన్నారు. అదేవిధంగా అల్లూరి విజ్ఞాన కేంద్రం ద్వారా ఒక ట్రైనింగ్‌ సెంటర్‌ ను నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని తెలపారు. ఈ కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ వై శివ నరేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

joot bag