Aug 18,2022 21:08

ప్రారంభ ధర రూ.89,999
హైదరాబాద్‌ : 
 సామ్‌సంగ్‌ ఇండియా కొత్తగా గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 4, గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌4ను ఆవిష్కరించింది. ఈ మడత ఫోన్లను గురువారం హైదరాబాద్‌ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి విడుదల చేసింది. నాల్గవ తరం ఈ ఫోన్లు ఆగస్టు 16 నుంచి దేశవ్యాప్తంగా రిటైల్‌ స్టోర్లతో పాటుగా ఆన్‌లైన్‌లో ముందస్తు బుకింగ్స్‌ను తెరిచినట్లు తెలిపింది. బోరా పర్పుల్‌, గ్రాఫైట్‌, పింక్‌ గోల్డ్‌ రంగులలో లభ్యమయ్యే గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 4 ధర 8జిబి, 128జిబి వేరియంట్‌ కోసం రూ.89,999 కాగా 8బిజి, 256జిబి వేరియంట్‌ ధరను రూ.94,999గా నిర్ణయించింది. గ్రేగ్రీన్‌, బీగీ, ఫాంటమ్‌ బ్లాక్‌లో లభ్యమయ్యే గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 4 ఫోన్‌ 12జిబి, 256 జిబి వేరియంట్‌ రూ.1,54,999గా, 12జిబి, 512జిబి వేరియంట్‌ రూ.1,64,999 లభ్యమవుతుందని తెలిపింది. వినియోగదారులు 12జిబి, 1టిబి వేరియంట్  ధరను రూ.1,84,999గా నిర్ణయించింది. ''వీటిలో ప్రతిష్టాత్మకమైన కెమెరా, అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌, పూర్తి సరికొత్త డిజైన్‌ ఉన్నాయి. గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 4 అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌. గెలాక్సీ జెడ్‌ 4 ఫ్లిప్‌4 యొక్క కంపాక్ట్‌ కామ్‌షెల్‌ డిజైన్‌ వినూత్న అనుభవాలను అందిస్తుంది గెలాక్సీ జెడ్‌ సిరీస్‌, వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్స్‌తో సంభాషించే విధానంలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది'' అని సామ్‌సంగ్‌ ఇండిమా ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ డైరెక్టర్‌ ఆదిత్య బబ్బర్‌ పేర్కొన్నారు.