Jul 02,2022 11:58

ప్రజాశక్తి - అమరావతి : గన్నవరం ఎమ్మెల్యే వంశీకి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల పంజాబ్‌ రాష్ట్రంలోని మొహలీ ఐఎస్‌బీ క్యాంపస్‌లో క్లాసులకు వెళ్లారు. 14 గంటలు క్యాంపస్‌లోనే గడపాల్సి రావడంతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ ఏఐజీ ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించగా ఎమ్మెల్యే వంశీకి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. గతంలో కూడా వంశీ కరోనా బారినపడ్డారు. వంశీ హౌం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని, కోలుకున్న అనంతరం నియోజవర్గానికి వస్తారని ఆయన సన్నిహితులు తెలిపారు.