
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సాహిత్య పురస్కారమైన బుకర్‌ప్రైజ్ 2023 అవార్డును 'టైమ్ షెల్టర్' పుస్తక రచయిత జార్జి గోస్పోడినోవ్‌కి దక్కింది. ఈ పుస్తకాన్ని ఏంజెలా రోడెల్ ఇంగ్లీషులోకి అనువదించారు. ఈ బహుమతిని సొంతం చేసుకున్న తొలి బల్గేరియన్ నవల 'టైమ్ షెల్టర్' కావడం విశేషం. ఇక ఈ పుస్తకాన్ని ఈ పురస్కారానికి ఎంపిక చేసిన న్యాయమూర్తుల్లో ఒకరైన చైర్ లీలా మాట్లాడుతూ... ''టైమ్ షెల్టర్' అద్భుతమైన నవల. వ్యంగ్యం, విచారంతో కూడిన ఈ నవల సమకాలీన ప్రశ్నల్ని లెవనెత్తే లోతైన రచన. మన జ్ఞాపకాలు అదృశ్యమైనప్పుడు మనకు ఏమి జరుగుతుంది? అనే దానిపై జార్జి ఈ నవలను రచించారు. గతం గురించి కేవలం వ్యక్తిగతంగానే కాదు.. సామూహిక విధితో వ్యవహరించి.. సార్వత్రికమైన సంక్లిష్ట సమతుల్యతను జార్జి హృద్యయంగా మనసుకు హత్తుకునేలా రచించార'ని ఆయన అన్నారు.
కాగా, టైమ్ షెల్టర్ అనే నవల గతానికి సంబంధించింది. ఈ అల్జీమర్ చికిత్సలో కూడా దశాబ్దాల కిందటిది కూడా రోగులకు వర్తమానంలో పదేపదే చెప్పి గుర్తు చేయాల్సి ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా.. గతం వర్తమానంపై దాడి చేస్తూనే ఉంటుంది' అని అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ వెబ్‌సైట్ పేర్కొంది. ఇక ఈ పుస్తకంపై జార్జి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఘడియలలో ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చనే భావన నుండి ఈ పుస్తకం రాయాలని నాకు కోరిక కలిగింది. 2016 తర్వాత మనం మరో లోకంలో జీవిస్తున్నట్లుగా అనిపించింది. పాపులిజం యొక్క ఆక్రమణతో ప్రపంచం విచ్ఛిన్నం కావడం, అమెరికా, ఐరోపాలో 'మహా గతం' యొక్క కార్డును ప్లే చేయడం నన్ను రెచ్చగొట్టింది. ఇక ఇది మాత్రమే కాదు.. బ్రెగ్జిట్ కూడా మరో ట్రిగ్గర్ పాయింట్‌గానే నా ఆలోచనగా ఉంది. నేను కమ్యూనిజం కింద 'ఉజ్వల భవిష్యత్తు'ను విక్రయించిన వ్యవస్థ నుండి వచ్చాను. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రజావాదులు 'ప్రకాశవంతమైన గతాన్ని' విక్రయిస్తున్నారు. అందుకే ప్రతి ఐరోపా దేశం చేపట్టిన 'గతంపై ప్రజాభిప్రాయ సేకరణ' గురించి ఈ కథ చెప్పాలనుకున్నాను. గతంలో మహమ్మారి మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం ఏమి చేశాము? భవిష్యత్తు ఉండదనుకునే వ్యక్తి ఎలా జీవిస్తారు? అనే ఒక సంక్లిష్ట ఆలోచన నుంచే ఈ నవలను రచించాను. ఇక రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో తిరిగి ప్రదర్శించడానికి సేకరించిన దళాలు, ట్యాంకులు అనుకోకుండా పొరుగు దేశం యొక్క భూభాగాన్ని ఆక్రమించాయి. నవల యొక్క చివర అధ్యాయం గతం ఎలా జీవిస్తుందో వివరిస్తుంది. ఈ నవల 2020 బల్గేరియన్‌లో ప్రచురించబడింది' అని ఆయన అన్నారు.
జార్జి గోస్పోడినోవ్ బల్గేరియన్ కవి, రచయిత, నాటక రచయిత అని ది గార్డియన్ వార్తాపత్రిక వెల్లడించింది. ఈ నవల ప్రచురించబడినప్పుడు అగ్రస్థానంలో ఉంది. అలాగే స్ట్రెగా యూరోపియన్ బహమతిని ఈ నవల గెలుచుకుంది.