Oct 01,2022 22:25

శ్రీలంకపై 41పరుగుల తేడాతో గెలుపు
ఢాకా: ఆసియాకప్‌ మహిళల టి20లో టీమిండియా శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 41పరుగుల తేడాతో శ్రీలంక మహిళలపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ప్రీత్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 160పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(10), మంధాన(6) నిరాశపరిచినా.. రోడ్రిగ్స్‌(76), హర్మన్‌ప్రీత్‌(33) బ్యాటింగ్‌లో మెరిసారు. రణసింఘేకు మూడు, కుమారి, ఆటపట్టుకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో శ్రీలంక మహిళలు 18.2ఓవర్లలో 109పరుగులకే ఆలౌటయ్యారు. ఓపెనర్‌ మాధవి(26), పెరీరా(30), రణసింఘే(11) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. హేమలతకు మూడు, వస్త్రాకర్‌, దీప్తికి రెండేసి వికెట్లు కద్కాయి. ఏడు జట్ల మధ్య జరుగుతున్న టోర్నీలో టాప్‌-4లో నిలిచిన నాలుగుజట్లు సెమీఫైనల్‌కు చేరనున్నాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రోడ్రిగ్స్‌కు లభించింది.
తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ మహిళలజట్టు 9వికెట్ల తేడాతో థారులాండ్‌పై ఘన విజయం సాధించింది. థారులాండ్‌ జట్టు 19.4ఓవర్లలో 82పరుగులకు ఆలౌట్‌ కాగా.. బంగ్లాదేశ్‌ జట్టు 11.4ఓవర్లలో ఒక వికెట్‌ నష్టపోయి 88పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ షమీమా సుల్తాన్‌కు లభించింది.
ఆసియాకప్‌లో నేడు..
పాకిస్తాన్‌ మహిళలు × మలేషియా మహిళలు