
మాస్హీరో రవితేజ నటిస్తోన్న చిత్రం 'రావణాసుర'. యూనిక్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కు తున్న ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మరో రెండు రోజుల్లో రవితేజ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ అందించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. జనవరి 26న రావణాసుర గ్లింప్స్ వీడియోను లాంఛ్ చేయనున్నట్టు ఓ వీడియో ద్వారా తెలియజేశారు. రావణాసురలో అనూ ఎమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో యువ నటుడు సుశాంత్ విలన్గా నటిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.