
-లాంగ్‌జంప్‌లో శ్రీశంకర్‌కు రజతాం కొనసాగుతున్న రెజ్లర్ల హవా, క్వార్టర్స్‌కు సింధు, శ్రీకాంత్
బర్మింగ్‌హాం: కామన్వెల్త్ క్రీడల్లో భారత పారా వెయిట్‌లిఫ్టర్ సుధీర్ స్వర్ణ పతకం సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో 27ఏళ్ల సుధీర్.. సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తొలి ప్రయత్నంలోనే 208 కేజీల బరువెత్తిన సుధీర్.. రెండో ప్రయత్నంలో 212 కిలోలు ఎత్తాడు. దీంతో మొత్తంగా 134.5పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక క్రిస్టియన్ ఒబిచు(ఇంగ్లండ్)కు 133.6పాయింట్లతో రజతం, 130.9 పాయింట్లతో మిక్కి యులె(దక్షిణాఫ్రికా) కాంస్యం సాధించారు. జూన్‌లో దక్షిణ కొరియాలో జరిగిన వరల్డ్ పారా పవర్‌లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో 214 కిలోల బరువెత్తి సుధీర్ కాంస్యం సొంతం చేసుకున్నారు. అలాగే హాంగ్జూలో జరిగే ఆసియా పారా గేమ్స్‌కు సుధీర్ అర్హత సాధించాడు.

లాంగ్‌జంప్‌లో శ్రీశంకర్‌కు రజతం
లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం జరిగిన లాంగ్‌జంప్ ఫైనల్లో కేరళకు చెందిన శ్రీశంకర్.. ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. ఇక బహమాస్‌కు చెందిన లకాన్ నైర్న్ స్వర్ణం గెలుచుకున్నాడు. లకాన్ కూడా 8.08 మీటర్లే దూకినప్పటికీ.. అతని సెకండ్ బెస్ట్ అటెమ్ట్ (7.98 మీటర్లు) శ్రీశంకర్ (7.84 మీటర్లు) కంటే మెరుగ్గా ఉండడంతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల లాంగ్‌జంప్ విభాగంలో భారత్‌కు పతకం సాధించిన రెండో ఆటగాడిగా శ్రీశంకర్ నిలిచాడు. 1978లో కెనడాలో జరిగిన సురేశ్ కాంస్యం గెలుపొందాడు. ఆ తర్వాత లాంగ్‌జంప్‌లో భారత్‌కు కామన్వెల్త్ పతకం లభించడం ఇదే మొదటిసారి.
సత్తా చాటుతున్న రెజ్లర్లు
రెజ్లింగ్ విభాగం ఫైనల్లోకి నలుగురు ప్రవేశించారు. మహిళల విభాగంలో సాక్షి, అన్షుతోపాటు పురుషుల విభాగంలో దీపక్, బజరంగ్ పునియా ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన సెమీస్ పురుషుల విభాగంలో 86కిలోల విభాగం ఫైనల్లోకి దీపక్ పునియ 3-1పాయింట్ల తేడాతో అలెగ్జాండర్ మోరె(కెనడా)పై విజయం సాధించాడు. ఇక బజరంగ్ పునియా 10-0తో జార్జి రామ్(ఇంగ్లండ్)ను ఓడించాడు. ఇక మహిళల 57కిలోల విభాగంలో అన్షుమాలిక్ 10-0తో టెక్నికల్ సూపియారిటీలో శ్రీలంకకు చెందిన నెత్మీపై, 62కిలోల విభాగంలో సాక్షి మాలిక్ 10-0తో కెమరూన్‌కు చెందిన నొల్లీపై విజయం సాధించారు.
బాక్సింగ్ సెమీఫైనల్లోకి ఇప్పటికే ఏడుగురు ప్రవేశించడంతో ఆ విభాగం నుంచి మరో ఏడు పతకాలు దక్కడం ఖాయం.