Jun 28,2022 21:44

ప్రజాశక్తి-సింగరాయకొండ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 1998 డిఎస్‌సి పోస్టులతో అభ్యర్థులు ఒకపక్క ఆనందంతో..మరోపక్క విచారంతో ఉన్నారు. పదవీ విరమణ వయస్సులో తమకు ఉద్యోగం వచ్చిందని ఆనందించాలో.. సర్వీసు ఉన్నది ఒక్క సంవత్సరమే అని బాధపడాలో తెలియడం లేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం, సోమరాజుపల్లికి చెందిన ఎస్‌కె.మస్తాన్‌వలీ అప్పట్లో బిఎస్‌సి, బిఇడి చదివి డిఎస్‌సి రాసి ఉత్తీర్ణుడయ్యారు. అయినా ఉద్యోగం రాకపోవడంతో నగరంలోని డాక్టర్‌ శివరామిరెడ్డి హాస్పిటల్‌లో కాంపౌండర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన వయస్సు 61 సంవత్సరాలు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 1998 డిఎస్‌సి జాబితాలో మస్తాన్‌వలీ పేరు ఉంది. తొలుత ఆనంద పడినా.. పదవీ విరమణ వయస్సులో ఉద్యోగం వచ్చిందని మస్తాన్‌ వలీ బాధపడుతున్నారు.