
తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మౌత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీరోడ్డు మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. యాత్రికులు గోవిందనామస్మరణతో రథాన్ని లాగారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు.రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనంపై ఊరేగనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, కంకణ భట్టర్ ఏపీ శ్రీనివాస దీక్షితులు, జేఈవో వీరబ్రహ్మం, ఎఫ్‌ఏసీఏవో బాలాజీ, సీఈ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో శాంతి, తదితరులు పాల్గోన్నారు. రష్యాకు చెందిన అచ్యుత మాధవ దాసు అనే యాత్రికుడు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ట్రస్టులకు గురువారం రూ.7 లక్షల 64 వేలు విరాళంగా అందించారు. దాత తరపున ఆయన స్నేహితుడు కఅష్ణ కన్నయ్య దాస్ టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ఎవి ధర్మారెడ్డికి విరాళం డీడీలను అందజేశారు.ఇందులో ఎస్వీబీసీ ట్రస్ట్ కు రూ. లక్ష 64 వేలు, ఎస్వీ అన్నప్రసాదం, గోసంరక్షణ, ప్రాణదాన, విద్యా దాన, వేద పారాయణ ట్రస్టు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంలకు రూ.లక్ష చొప్పున విరాళం అందించారు.