
ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : స్థానిక సంఘం కాలనీలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు చిట్టూరి వెంకట శ్రీధర్ భారత రాజ్యాంగం గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు బోనం సునీత, తదితరులు పాల్గొన్నారు.