Nov 16,2022 20:17

'ఇకపై వారాంతపు భోజనాలు ఇంతకు ముందులా ఉండవు. మీరు నాకెన్నో విలువైన విషయాలు నేర్పించారు. నన్నెప్పుడూ నవ్వించేవారు. ఇప్పటినుంచి అవన్నీ మీ జ్ఞాపకాలుగా నాకు గుర్తుండిపోతాయి. తాత గారు మీరు నా హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి నేను చేరుకుంటాను. మిమ్మల్ని బాగా మిస్‌ అవుతున్నా..' అంటూ మహేష్‌బాబు కుమార్తె సితార తాతయ్య కృష్ణతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్టు చేసింది. చాలా స్వల్ప వ్యవధిలోనే తాతయ్య, నాయనమ్మ మరణించడం తట్టుకోలేని సితార ఎంతో భావోద్వేగంతో చేసిన ఈ పోస్టు బాగా వైరల్‌ అవుతోంది. 'బి స్ట్రాంగ్‌ సీతూ పాప' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.