
విశాఖపట్నం జిల్లా
రాయవరం గ్రామాన
నవయుగ వైతాళికుడు
గురజాడ ఉదయించె
చిన్ననాటి నుండియే
సంస్కరణ భావాలు
మెండుగా కలిగియున్న
యుగకర్త గురజాడ
తొలి తెలుగు కథానిక
'దిద్దుబాటు' రచించెను
సంఘ సంస్కరణకు
శ్రీకారము చుట్టెను
'కన్యాశుల్కము' అనే
గొప్ప నాటకము రాసెను
సంఘ దురాచారాలను
ధీటుగా దునుమాడెను
దేశమంటే మనుషులనీ
ఎలుగెత్తి చాటెను
మతమలన్ని మాసిపోయి
జ్ఞానమే నిలుచుననెను
మహిళా మూర్తులలో
చైతన్యము నింపెను
ఆధునిక మహిళకు
కొత్త అర్థం చెప్పెను
బాల్యవివాహాలను
గట్టిగా ఎదిరించెను
కన్యాశుల్కం దురాచారాన్ని
తొలగించగ పోరాడెను
తెలుగు సాహిత్యంలో
ప్రజలభాష వాడెను
మాతృభాష తెలుగునకు
కొత్త సొబగులద్దెను
అభ్యుదయ భావాలకు
కొత్త బాట వేసెను
తన రచనలు ద్వారా
సమాజ మార్పు కోరెను
అతనే మన భావిజాడ
అతనే మన వెలుగు జాడ
అతనే మన అడుగుజాడ
అతనే మన గురజాడ
- రావిపల్లి వాసుదేవరావు
94417 13136