Nov 22,2022 21:38

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మహిళలను అవమానపరిచే చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ సమాఖ్య పేరుతో వార్షిక అవార్డును ఇవ్వడం తగదని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి ప్రభావతి, డి రమాదేవి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. మనుషులను ప్రేమించాలన్న అద్భుత ఆలోచనలతో గురజాడ రచనలు చేశారని, మహిళలను హింసించాలనే కోణంలో చాగంటి ప్రవచనాలు చేస్తున్నారని అటువంటి వ్యక్తికి గురజాడ అవార్డు ఇవ్వడం సరికాదని తెలిపారు. ఆయనకు అవార్డు ఇవ్వడం అంటే ఆధునిక చరిత్రను స్త్రీలు పునర్లికిస్తారన్న గురజాడను అవమానించడమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతికశాఖ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.