
ముంబయి : ప్రముఖ గృహ రుణాల జారీ సంస్థ హెచ్‌డిఎఫ్‌సికి రిజర్వ్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. పలు నిబంధనలు ఉల్లఘించినందుకు గాను రూ.5 లక్షల జరిమానా విధించింది. 2019-20లో కొంతమంది డిపాజిటర్ల మెచ్యూర్డ్ డిపాజిట్లను కంపెనీ వారి నిర్దేశిత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయకపోవడంపై ఆర్‌బిఐ నోటీసులు జారీ చేయగా.. హెచ్‌డిఎఫ్‌సి ఇచ్చిన వివరణ సంతృప్తి పర్చలేదు. దీంతో ఆ బ్యాంక్‌పై జరిమానా వేసింది.