Jan 30,2023 13:13

ప్రజాశక్తి-పీలేరు (రాయచోటి) : గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీలేరులో చోటు చేసుకుంది. సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ పక్కన ఉన్న వారపు సంతలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కలకడ మండలానికి చెందినవాడుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.