Nov 24,2022 19:58

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా పిరియాడికల్‌ కథాంశంతో భారీ బుడ్జెతో తెరకెక్కుతున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఏ ఎమ్‌ రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.ఈ నేపథ్యంలో షూటింగ్‌కు సంబంధించిన విశేషాలను మేకర్స్‌ వెల్లడించారు.''చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. సూక్ష్మమైన వివరాలు, పరిశోధన, వందలాది తారాగణం మరియు సిబ్బంది యొక్క అపారమైన కృషి అవసరమవుతుంది. అక్టోబర్‌ చివరి వారం నుండి షెడ్యూల్‌ ప్రకారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన భారీ సెట్‌లో 'హరి హర వీరమల్లు' చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. పవన్‌ కళ్యాణ్‌ గారితో పాటు 900 మంది నటీనటులు.. సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు. 'హరి హర వీరమల్లు' ఒక మైలురాయి చిత్రం అవుతుందని.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం.''అని చిత్ర బందం వెల్లడించింది.