Jun 25,2022 18:40

ఇంటర్నెట్‌డెస్క్‌ : దగ్గరి బంధువులు ప్రాణాపాయ స్థితిలో ఉంటేనే పట్టించుకోని రోజులివి. అలాంటిది..ఎవరో తెలియని వ్యక్తి కోసం.. ప్రాణాలకు తెగించి కాపాడడం గొప్ప విషయం. ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దూరం నుంచి రైలు కూడా వస్తోంది. అయితే ఆ సమయంలో స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న రైల్వే సిబ్బంది అతనిని గమనించాడు. ఇక వెంటనే పరుగుత్తుకుంటూ వెళ్లి.. రైలు పట్టాలపై పడుకున్న వ్యక్తిని ఎత్తుకుని పక్క ట్రాక్‌ మీదకు తీసుకెళ్లాడు. అలా కాపాడిన మరుక్షణంలోనే.. పట్టాలపై రైలు వేగంగా వెళ్లింది. ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడీ జరిగిందనే సమాచారం లేదు. కానీ ప్రాణాలకు తెగించి కాపాడిన వ్యక్తి పేరు సతీష్‌కుమార్‌ అని తెలిసింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్‌ రైల్వేస్‌ తమ అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. అలాగే సతీష్‌కుమార్‌లాంటి ధైర్యవంతులు భారతీయ రైల్వేలో ఉన్నందుకు గర్వంగా ఉంది' అంటూ ట్వీట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సతీష్‌కుమార్‌ ధైర్యసాహసానికి హ్యాట్సాఫ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అలాగే రైల్వే సిబ్బందితోపాటు, అక్కడున్న అధికారులు కూడా సతీష్‌కుమార్‌ని ప్రశంసించారు.

सेवा, सुरक्षा और सहयोग

A precious life was saved by the courageous act of help by on-duty staff, who jumped on tracks himself to save a person from getting gravely injured.
Indian Railways is proud to have daring & diligent staff like H. Satish Kumar and commends his bravery. pic.twitter.com/gcnHCrtXg4