
హైదరాబాద్ : తెలంగాణలో సంయుక్త కిసాన్ మోర్చా, ఆదివాసి అటవీ హక్కుల సంరక్షణ సమన్వయ కమిటీలు నేడు చలో రాజ్‌భవన్‌కు పిలుపునివ్వడంతో తెలంగాణ రాజ్‌భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారం, అటవీ సంరక్షణ నియమాలు-2022లను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ... దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో నేతలు చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాజ్‌భవన్ వద్ద భారీగా మోహరించారు. ఖైరతాబాద్ కూడలి నుంచి రాజ్‌భవన్ వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు.