Oct 05,2022 16:06

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరు, పల్నాడు జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. గుంటూరు పరిసర ప్రాంతాల్లో బుదవారం ఉదయం 9 గంటల నుంచి ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గుంటూరులోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. పలు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజలు, వాహన దారులు అవస్థలు పడుతున్నారు. రహదారులపై జనసంచారం తగ్గిపోయింది. భారీ వర్షంతో వ్యాపారులు కొనుగోలు చేసే వారు లేక నిరాశకు లోనయ్యారు. తెనాలి, మంగళగిరి, తాడికొండ, పత్తిపాడు తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. రహదారుల పక్కన నిర్వహించే వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.