Oct 05,2022 17:09

ప్రజాశక్తి - అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎపిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... ఈ ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించింది.