Oct 05,2022 15:51

అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది.కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాలైన కఅష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే దీని తీవ్రత కొద్దిమేర తగ్గిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కోస్తాంధ్ర మీదుగా పరిసర ప్రాంతాలపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. .