Mar 22,2023 08:43

హలో నేస్తమా కుశలమా
అంతా పాత సీసాలో
కొత్త జ్ఞాపకం ఈ ఉగాది
తెలుగు ఉగాది అంటూనే
తెలుగుకు తెగులు పట్టిస్తున్నారు
అమ్మా నాన్నను
మరిపించే మమ్మీ డాడీ స్కూల్‌
సంస్కృతికి దాసోహం
తెలుగు కు విలువేది వెలుగు కు చోటేది
ఏడాదికో మారు
కొత్త సంవత్సరం వస్తూనే ఉంటుంది
ఎక్కడ చూసినా ఏమున్నది
గర్వకారణం పెరిగిన ధరలు
తరిగిన బతుకులు
రాజకీయం చూస్తే రచ్చ రచ్చ
శుభ కృత్‌ కు స్వాగతం
ఎలా చెప్పను ఏమని చెప్పను
 

- ఎల్‌. ప్రఫుల్లచంద్ర,
సెల్‌ : 6300546700