Nov 23,2022 11:46

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ నటి హన్సిక, తన బిజినెస్‌ పార్టనర్‌ సోహాల్‌ని త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 4 జరిగే వీరి వివాహానికి జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌ వేదిక కానుంది. పెళ్లికి ముందు జరిగే మాతా కీ చౌకీ (దుర్గాదేవి) పూజా కార్యక్రమం ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కాబోయే వధూవరులిద్దరూ ఎరుపు రంగు దుస్తుల్ని ధరించి మెరిసిపోయారు. ఇక ఈ పూజలో పాల్గొనబోయే ముందు హన్సిక కారులో ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది.
మాతా కీ చౌకీ కార్యక్రమంతోనే హన్సిక పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్‌ 2న సూఫీ నైట్‌, డిసెంబర్‌ 3న మెహందీ, సంగీత వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్ని ఓటీటీలోనూ ప్రత్యప్రసారం చేయనున్నారు. అయితే హన్సిక వివాహం చేసుకోబోయే సోహాల్‌కి గతంలోనే వివాహామైంది. హన్సిక స్నేహితురాలైన రింకీని అతను వివాహాం చేసుకున్నారు. కొంతకాలానికే వీరిద్దరి మధ్య మనసపర్థలు వచ్చి విడిపోయారు.