Nov 23,2022 18:45

అడివి శేష్‌ నటించిన తాజా చిత్రం 'హిట్‌ : ది సెకండ్‌ కేస్‌'. శైలేష్‌ కొలను ఈ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహించారు. 'హిట్‌' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. తనికెళ్ళ భరణి, శ్రీకాంత్‌ మాగంటి, కోమలి ప్రసాద్‌ ఇతర పాత్రల్లో నటించారు. 'హిట్‌' ఫస్ట్‌ కేసుని తెలంగాణాలో ఛేదిస్తే.. 'హిట్‌ 2' లో ఆంధ్రప్రదేశ్‌ లోని కేసుని డీల్‌ చేసినట్లు తెలుస్తోంది. నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022 డిసెంబర్‌ 2న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.