
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ సెమీఫైనల్లోకి బెల్జియం, ఆస్ట్రేలియా జట్లు దూసుకెళ్లాయి. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్‌లో బెల్జియం జట్టు 2-0గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను, ఆస్ట్రేలియా జట్టు 4-3గోల్స్ తేడాతో స్పెయిన్‌ను ఓడించాయి. ఆస్ట్రేలియా-స్పెయిన్ జట్ల మధ్య జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. తొలి రెండు క్వార్టర్స్ ముగిసే సరికి ఆస్ట్రేలియా జట్టు 1-2గోల్స్‌తో వెనుకబడింది. ఆ తర్వాత మూడో క్వార్టర్స్ ప్రారంభంలోనే ఆస్ట్రేలియా జట్టు వరుసగా మూడు గోల్స్ కొట్టి 4-2 ఆధిక్యతలోకి దూసుకొచ్చింది. చివర్లో ఇరుజట్లు ఒక్కో గోల్స్ కొట్టాయి. దీంతో ఆస్ట్రేలియా జట్టు గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఇక బెల్జియం తరఫున బూన్(11వ ని.), వాన్ అల్బెల్(16వ ని.) ఒక్కో గోల్ కొట్టారు. నేడు ఇంగ్లండ్-జర్మనీ, నెదర్లాండ్స్-కొరియా జట్ల మధ్య క్వార్టర్‌ఫైనల్ పోటీలు జరగనున్నాయి.