Sep 15,2023 21:23

పూణె : వేతన జీవులకు 8.45 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలు అందించనున్నట్లు బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. ప్రస్తుత పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని రూ.1 లక్షకు కేవలం రూ.729 నుండి నెలసరి వాయిదా (ఇఎంఐ) ప్రారంభం అవుతుందని వెల్లడించింది. 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న దరఖాస్తుదారులు తక్కువ వడ్డీకే రుణం పొందవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్లు 2023 నవంబర్‌ 12 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. గరిష్టంగా 40 ఏళ్ల పరిమితిలో గృహ రుణాలు జారీ చేయబడతాయని తెలిపింది.