
బెంగళూరు : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం తుది ఘట్టానికి చేరుకుంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలోని కొన్ని హోటళ్లు బుధవారం ఓటు వేసేందుకు బయటకు వచ్చే ఓటర్లకు ఉచితంగా ఆహారం అందిస్తామని పేర్కొన్నాయి. ఓటర్లకు ఉచితంగా లేదా రాయితీపై ఆహారం, పానీయాలు ఆఫర్ చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఏ హోటల్‌లోనైనా అలాంటివి ఆఫర్ చేస్తే హోటిల్ యజమానిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, అవసరమైతే జైల్లో కూడా పెట్టే అవకాశం ఉందని ఇసి హెచ్చరించింది.