Nov 24,2022 16:42

ఇంటర్నెట్‌డెస్క్‌ : పిల్లలు అల్లరి చేస్తున్నారని, మాట వినడం లేదని తల్లిదండ్రులు బెదిరిస్తుంటారు. భయపెడుతుంటారు. పెద్దల ప్రవర్తన వల్ల చిన్నారులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులే చిన్నారుల ఎదుగుదలకు తోడ్పడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
- చిన్నారులు ఇంట్లో ఏ వస్తువు పట్టుకున్నా, పడేసినా.. తల్లిదండ్రులు స్వరం పెంచి మాట్లాడతారు. దీంతో పిల్లలు భయపడిపోయి ఆటలకు దూరమవుతారని మానసిక నిపుణులు చెబుతున్నారు. మానసికోల్లాసానికి ఆటలెంతో దోహదం చేస్తాయి. వారి చేష్టలకు విసుగు చెందకుండా ఓర్పుగా ఉండాలని, వారితో ప్రేమగా మాట్లాడాలని డాక్టర్లు చెబుతున్నారు.
- పిల్లల విషయంలో తల్లిదండ్రులు పదేపదే గొడవపడుతుంటే చిన్నారులు ఇంటి వాతావరణానికి భయపడిపోతారు. చదువులోనూ వెనుకబడిపోతారు.
- చిన్నారుల భవిష్యత్తు కోసం, మెరుగైన జీవితం కోసమే తాము అలా ప్రవర్తిస్తున్నట్లు తల్లిదండ్రులు చెప్పినప్పటికీ అది ప్రమాదకర ధోరణికి దారితీస్తుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.