Jul 05,2022 11:26

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌ (గుంటూరు) : పాఠశాల విలీన ప్రక్రియను ఉపసంహరించుకోవాలని సత్తెనపల్లి మండలంలోని పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ఆందోళన చేపట్టారు. సత్తెనపల్లి మండలం నందిగామ ఎస్సీ కాలనీలో ఉన్న మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులను కిలోమీటరు దూరంలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఈనేపథ్యంలో ' దూరమైన బడికి మా పిల్లలను ఎలా పంపించగలం ' అంటూ పాఠశాల ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అమరావతి రోడ్డు దాటి పాఠశాలకు వెళ్ళాల్సి వస్తుందని, తమ పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. రోజూ తాము కూలీ పనులకు వెళతామని.. సమయానికి పిల్లలను బడికి ఎవరు తీసుకెళతారని అడిగారు. విలీన ప్రక్రియను ఉపసంహరించుకోవాలి డిమాండ్‌ చేశారు.