May 25,2023 21:32

ముంబయి : హెచ్‌డిఎఫ్‌సి పెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పిఎస్‌)లో 2023 మే 15 నాటికి రూ.50,000 కోట్ల అసెట్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎయుఎం) నిధుల మార్క్‌ను చేరినట్లు ప్రకటించింది. 2020లో రూ.10వేల కోట్ల ఆస్తులు ఉండగా.. 33 నెలల్లోనే 400 శాతం వృద్థిని సాధించినట్లు పేర్కొంది. ''ఇది మాకు చాలా గర్వకారణమైన సమయం. రూ.50,000 కోట్లు ఎయుఎం మైలురాయిని దాటినందుకు సంతోషిస్తున్నాము. ఈ ఏడాది పదేళ్లు వ్యాపారాన్ని పూర్తి చేసుకునే సమయంలో ఈ విజయం మరింత ముఖ్యమైంది.'' అని హెచ్‌డిఎఫ్‌సి పెన్షన్‌ సంస్థ సిఇఒ శ్రీరామ్‌ అయ్యర్‌ తెలిపారు.