Jul 02,2022 18:18

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ సీనియర్‌ నటి జయద్ర తాను నటించిన సినిమాల్ని ఇప్పటివరకు వెండితెరపై చూసుకోలేదట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. జయప్రద అలనాటి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు వంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఆమె ఒక్క టాలీవుడ్‌లోనే కాదు.. హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ, మరాఠీ వంటి పలు భాషా చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలపై మాట్లాడారు. 'నా సినీ కెరీర్‌ మొదట్లో.. నాకెన్నో భయాలున్నాయి. నా మేకప్‌, హెయిర్‌స్టైల్‌ ఎలా ఉంటుందోనని భయపడుతూ ఉండేదాన్ని. అది పిచ్చో, భయమో తెలియదు కానీ.. ఇప్పటివరకు నేను నటించిన సినిమాల్ని తెరపై చూడలేదు' అని చెప్పుకొచ్చారు.
దాసరి బికినీ వేయమంటే ఏడ్చేశాను :జయప్రద
కాగా, ఆమె దాసరి నారాయణ దర్శకత్వంలో చాలా సినిమాల్లో నటించారు. ఓసారి దాసరినారాయణరావు బికినీ వేసుకోమంటే ఏడ్చేసిందట. ఇంటర్వ్యూలో ఈ విషయంపై కూడా ఆమె మాట్లాడారు. 'నేను దాసరి నారాయణ దర్శకత్వంలో చాలా సినిమాలు చేశాను. దేవుడు దిగివస్తే అనే సినిమాకు అనుకుంటా.. ఒక సీన్‌ కోసం ఆయన నన్ను బికినీ వేసుకోమన్నారు. అంతే వెంటనే నేను ఏడవడం మొదలుపెట్టాను. దీంతో ఆయన నా దగ్గరకు వచ్చి.. ఎందుకు ఏడుస్తున్నావ్‌. నువ్వు వెళ్లి బికినీ వేసుకుని స్విమ్మింగ్‌ పూల్‌లోని టైర్‌లో కూర్చో. మిగతాది నేనుచూసుకుంటాను అని చెప్పారు. నేను అలాగే చేశాను. ఆయన ఆ సీన్‌ని ఎలాంటి ఎబ్బెట్టు లేకుండా ముగించేశారు. ఆ తర్వాత నేనెప్పుడూ బికినీ వేసుకోలేదు. అప్పుడే నిర్ణయించుకున్నా... బికినీ వేసుకోకూడదని... ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను' అని అన్నారు. ప్రస్తుతం జయప్రద వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

jayaprada 2

 

jayaprada 2

 

jayaprada 3