
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఐసెట్-2022 మొదటి దశ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను అడ్మిషన్ల కన్వీనరు, ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ కె రామ్మోహన్రావు శనివారం విడుదల చేశారు. ఐసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ నెల 9 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 10 నుంచి 14 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ 14 నుంచి 16 వరకు జరగనుంది. 17న వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు. 19న సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థులు 20 నుంచి 22లోపు కళాశాలల్లో రిపోర్టింగు చేయాలి. ఈ నెల 24 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం cets.apsche.ap.gov.in ను సందర్శించాలని కన్వీనరు వెల్లడించారు.