
'విరాటపర్వం వెన్నెల పాత్రను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఒక మరపురాని పాత్ర. ఆ పాత్ర పోషించినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. ఆ పాత్ర, చిత్రబృందం, చిత్రీకరణ రోజులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఇలాంటి అద్భుతమైన పాత్రను నాకందించిన రానా, వేణు ఉడుగుల, ఇతర బృందానికి ధన్యవాదాలు' అంటూ ట్విట్టర్లో సాయిపల్లవి తన 'విరాటపర్వం' స్టిల్స్‌ను షేర్చేశారు. జులై 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో 'విరాటపర్వం' సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా 'వెన్నెల ప్రయాణాన్ని మీరందరూ వీక్షిస్తే నేను మరింత ఆనందిస్తా' అంటూ సాయిపల్లవి తన ట్వీట్లో పేర్కొన్నారు.