Sep 30,2022 14:50

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై యాత్రకుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో పోలీసులు తమ కుటుంబ సభ్యుల ను దర్శనానికి తీసుకెళుతున్నారని, డ్యూటీ చేయడం ఇష్టంలేకపోతే వెళ్లిపోవచ్చంటూ డిప్యూటి సీఎం, దేవాదాయశాఖమంత్రి కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. ఇంద్రకీలాద్రిపై యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. అదే సమయంలో కుటుంబ సభ్యులను తీసుకెళుతున్న పోలీసులను మంత్రి కొట్టు మందలించారు. చినరాజగోపురం వీఐపీ ఎంట్రీ పాయింట్‌ వద్ద పోలీసులపై ఫైర్‌ అయ్యారు. డిఎస్పీ ఎక్కడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ చేయమంటే మీవాళ్లను పంపుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీకి కాల్‌ చేసి పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాచేస్తే ఊరుకోబోనంటూ మంత్రి పోలీసులను హెచ్చరించారు.