
ఇంటర్నెట్ డెస్క్ : సాధారణంగా 70 ఏళ్లు పైబడిన వారు కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. అయితే హర్యానాకు చెందిన ఓ బామ్మ మాత్రం.. 40 అడుగుల ఎత్తైన వంతెన పై నుంచి గంగా నదిలోకి దూకి ఈతకొట్టింది. ఈత మాత్రమే కాదండోరు.. ఈ బామ్మ డ్యాన్స్ కూడా అదరొట్టేస్తోంది. ప్రస్తుతం ఈ బామ్మ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఈ బామ్మ పేరు ఓంవతి (73). హర్యానాలోని సోంపేట్కు చెందిన ఈమె తాజాగా హరిద్వార్‌లోని హర్ కీ పౌరి వద్ద 40 అడుగుల ఎత్తైన వంతెన నుంచి గంగా నదిలోకి దూకి.. ఈదుకుంటూ.. నది అవతల ఒడ్డుకు చేరుకుంది. ఈమె అంత ఎత్తు నుంచి దూకడానికి కొందరు సహాయం చేశారనుకోండి. అయితే ఆమె అక్కడి నుంచి దూకడం మాత్రం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. దీనిపై ఓంవతి మాట్లాడుతూ..'నదుల్లో ఈతకొట్టడమంటే నాకెంతో ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచే నదుల్లో ఈతకొట్టే అలవాటుంది' అని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన నెట్టింట్లో అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. బామ్మ డేరింగ్‌కి ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఆమెకు డ్యాన్స్ కూడా ఎంతో ఇష్టమట.! ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
हर हर गंगे...🙏
— Rajan Rai (@RajanRa05092776) June 28, 2022
70 years old dadi jumping into the Ganges river from the bridge of Har Ki Pauri, Haridwar and she swimming comfortably.
Really this is unexpected.@ActorMadhavan @ShefVaidya @amritabhinder @bhumipednekar @VidyutJammwal @divyadutta25 @ImRaina @harbhajan_singh pic.twitter.com/kaCpXH8hy1
Joie de vivre! The 73-year-old who went viral for her dive into Ganga is also fond of dancing... pic.twitter.com/dtlOokNndp
— Boris A.K.A Bread & Circuses (@BorisPradhan) June 30, 2022