తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో.. శ్రీకాకుళం ''రేపటి ప్రయోజనం ఫౌండేషన్'' కు ''కీర్తి పురస్కారం''

శ్రీకాకుళం : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో.. శ్రీకాకుళం ''రేపటి ప్రయోజనం ఫౌండేషన్'' కు కీర్తి పురస్కారం దక్కింది. నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా నుండి '' రేపటి ప్రయోజనం ఫౌండేషన్ '' కు కీర్తి పురస్కారం అందించారని ఫౌండేషన్ ఫౌండర్ బాన్నా భార్గవ్ (బాలు) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అవార్డు అందుకున్న ఫౌండర్ బాలు మాట్లాడుతూ ... ఈ అవార్డు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ... శ్రీకాకుళం జిల్లాకు రావటం, అందరి సహకారంతో చేసిన సేవలను గుర్తించటం చాలా ఆనందంగా ఉందన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి హైదరాబాద్ లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో అతిరథుల చేతుల మీదుగా అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. అందరి సహకారం ఎప్పటికీ ఇలానే ఉండాలని, అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు కూర రగోత్తమ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్స్యులు జె.గౌరీశంకర్, పర్యాటక సమస్త చైర్మన్ యు.శ్రీనివాస గుప్తా, పూల రవీంద్ర, గ్లోబల్ ఆర్ట్స్ అకాడమీ ఛైర్పర్సన్ సీతామాడబూసి, పుడమి సాహిత్య అధ్యక్షులు సిహెచ్. బాలిరెడ్డి, రేపటి ప్రయోజనం బాన్న భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.