
వివరాలివే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయి సక్సెస్ను అందుకుంది ' పీపుల్ మీడియా ఫ్యాక్టరీ'. ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు కోలీవుడ్ సినిమాలనూ నిర్మించేందుకు సిద్ధమైంది. తమిళంలో తీస్తున్న తన మొదటి సినిమాను ప్రకటించింది. పాపులర్ తమిళ యాక్టర్ సంతానం టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం 'వడక్కుపట్టి రామసామి'. ఈ సినిమా టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సీన్ రోల్డన్ సంగీతం అందిస్తున్నాడు.