Aug 19,2022 12:55

ఫిన్లాండ్‌ : స్నేహితులతో కలిసి ఓ పార్టీలో డ్యాన్స్‌ చేయడంతో ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్‌ వివాదంలో చిక్కుకున్నారు. పార్టీలో ఆమె డ్రగ్స్‌ తీసుకుని ఉండొచ్చని, అందుకే ఆమె అంతలా పార్టీలో చిందేశారని ఆమెకు డ్రగ్‌ టెస్ట్‌ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.
తనపై వస్తున్న ఈ వార్తలపై మారిన్‌ స్పందించారు. తాను ఆ పార్టీలో డ్రగ్స్‌ తీసుకోలేదని, ఆల్కహాల్‌ మాత్రమే తీసుకున్నానని వివరించారు. ఓ రోజు సాయంత్రం మిత్రులందరం కలిసి పార్టీ చేసుకున్నామని, పాటలు పాడుతూ డ్యాన్స్‌ చేశామని పేర్కొన్నారు. వీడియో రికార్డు చేస్తున్న విషయం కూడా తనకు తెలుసని అన్నారు. అది చట్టబద్ధమేనని స్పష్టం చేశారు. అయితే, వీడియో బయటకు రావడం విచారకరమన్నారు. ప్రైవేటు వీడియో లీక్‌ కావడం మాత్రం దురదష్టకరమన్నారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు.