Aug 19,2022 06:48

కట్టెల పొయ్యి వల్ల కాలుష్యం అని తక్కువ ధరకే గ్యాస్‌ సిలిండర్‌ అలవాటు చేశారు. రేట్లు పెంచేసి కళ్ళలో దుమ్ము కొట్టారు. ఇంటర్నెట్‌ ఫ్రీ అంటూ జియో లాంటి స్మార్ట్‌ ఫోన్లు అలవాటు చేశారు. మనుషుల మధ్య సంబంధాలు పోయి చాటింగ్‌లు, షూటింగ్‌లతో బిజీ చేసేశారు. దీపాల వెలుతురు తీసేసి ఎల్‌ఇడి బల్బులు పంచారు. కరెంటు ఛార్జీలు పెంచి కడుపు కోత కోసేరు. పొదుపు సంఘాల పేరుతో ఇల్లాలిని రోడ్డెక్కించారు. పచ్చని కాపురాలలో నిప్పులు పోశారు. బ్యాంకు ఖాతాలలో డబ్బులు వేసి కిరాణా కొట్టుకెళ్తే జిఎస్టిలతో జేబులకు చిల్లు పెట్టారు. ప్రభుత్వరంగ పరిశ్రమలను, కంపెనీలను ప్రైవేట్‌పరం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇచ్చిన ఉద్యోగుల హక్కులు హరించారు. ఉదయం మేల్కొన్న దగ్గర నుంచి నిద్ర పోయేవరకు జిఎస్‌టి లతో పేదవాడి కూలి డబ్బులు లాగేసే ప్రయత్నం చేస్తున్నారు.
 

- తూమురౌతు శ్రీనివాసరావు, ఏలేశ్వరం.