Jul 02,2022 20:24

ముంబయి : వరుసగా మూడు వారాలు పడిపోయిన విదేశీ మారకం నిల్వలు జూన్‌ 24తో ముగిసిన వారంలో పెరిగాయి. ఈ సమీక్షా వారంలో భారత విదేశీ మారక నిల్వలు 2,734 బిలియన్‌ డాలర్లు పెరిగి 593,323 బిలియన్‌ డాలర్లకు చేరాయని ఆర్‌బిఐ గణంకాలు తెలిపాయి. ఈ నిల్వల్లో కీలకమైన కరెన్సీ ఆస్తుల విలువ 2.334 బిలియన్‌ డాలర్లు పెరిగి 529.216 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి నిల్వలు 342 మిలియన్‌ డాలర్లు పెరిగి 40,928 బిలియన్‌ డాలర్లకు చేరాయి.