Sep 23,2022 08:04

చెన్నై: న్యూజిలాండ్‌-ఏతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో ఇండియా-ఏ జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో ఇండియా-ఏ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌-ఏ జట్టు 40.2 ఓవర్లలో 167పరుగులకే కుప్పకూలింది. మిఛెల్‌(61) అర్ధసెంచరీతో రాణించగా.. కెప్టెన్‌ రాబర్ట్‌(22), వాల్కర్‌(36) ఫర్వాలేదనిపించారు. ఇండియా-ఏ బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌కు నాలుగు, కుల్దీప్‌ సేన్‌కు మూడు, కుల్దీప్‌ యాదవ్‌కు ఒక వికెట్‌ లభించాయి. ఆ లక్ష్యాన్ని ఇండియా-ఏ జట్టు 31.5ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 170పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్‌ పృథ్వీ షా(17) నిరాశపరిచినా.. గైక్వాడ్‌(41), త్రిపాఠి(31), సంజు(29నాటౌట్‌), పటీధర్‌(45) టీమిండియా-ఏ గెలుపులో కీలకపాత్ర పోషించారు. లాగాన్‌, మాధ్యూ, మిఛెల్‌కు తలా ఒక వికెట్‌ లభించాయి. రెండో వన్డే 25న, మూడో వన్డే 27న ఇదే వేదికపై జరగనున్నాయి.