Sep 29,2022 20:12

రారుపూర్‌: రోడ్‌ సేఫ్టీ ప్రపంచ సిరీస్‌ ఫైనల్లోకి ఇండియా లెజెండ్స్‌ జట్టు ప్రవేశించింది. బుధవారం రాత్రి జరిగిన సెమీస్‌లో ఇండియా లెజెండ్స్‌ జట్టు 5వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా లెజెండ్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా లెజెండ్స్‌ జట్టు నిర్ణీ 20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 171పరుగులు చేసింది. వాట్సన్‌(30), అలెక్స్‌(35), బెన్‌ డంక్‌(46), క్యామరూన్‌ వైట్‌(30) బ్యాటింగ్‌లో రాణించారు. మిథున్‌, యూసుఫ్‌ పఠాన్‌కు రెండేసి, రాహుల్‌ శర్మకు ఒక వికెట్‌ లభించాయి. ఛేదనలో భాగంగా కెప్టెన్‌ టెండూల్కర్‌(10) నిరాశపరిచినా.. మరో ఓపెనర్‌ నమన్‌ ఓఝా(90పరుగులు; 62బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు) బ్యాటింగ్‌లో రాణించాడు. రైనా(11), యువరాజ్‌(18), స్టువర్ట్‌ బిన్నీ(2), యూసుఫ్‌ పఠాన్‌(1) ఘోరంగా విఫలమయ్యారు. చివర్లో ఇర్ఫాన్‌ పఠాన్‌(37నాటౌట్‌; 12బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) చెలరేగడంతో టీమిండియా విజయం సాధించింది. వాట్సన్‌కు రెండు, క్రేజా, మెక్‌ గ్రెయిన్‌, రాడాన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. శ్రీలంక-వెస్టిండీస్‌ లెజెండ్స్‌ మరో సెమీస్‌ విజేతతో భారత్‌ శనివారం ఫైనల్లో తలపడనుంది.