Mar 22,2023 22:36

చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 270 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది.  బౌలింగ్ చేయడంతో భారత్ కు పరాజయం తప్పలేదు. జంపా 10 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఆస్టన్ అగర్ 2, స్టొయినిస్ 1, షాన్ అబ్బాట్ 1 వికెట్ తీశారు. టీమిండియా ఇన్నింగ్స్ లో కోహ్లీ (54),హార్దిక్ పాండ్యా (40) పరుగులు సాధించగా, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (37), కెప్టెన్ రోహిత్ శర్మ 30, కేఎల్ రాహుల్ 32 పరుగులు చేశారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు మూడు వన్డేల సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది.

  • అక్షర్‌ పటేల్‌ రనౌట్‌

7 బంతుల వ్యవధిలో టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. భారీ షాట్‌కు ప్రయత్నించి తొలుత రాహుల్‌ ఔట్‌ కాగా.. ఆతర్వాత అక్షర్‌ పటేల్‌ (2) రనౌటయ్యాడు. కోహ్లి (48), హార్ధిక్‌ పాండ్యా క్రీజ్‌లో ఉన్నారు. 

  • కేఎల్‌ రాహుల్‌ ఔట్‌

146 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి కేఎల్‌ రాహుల్‌ (32) ఔటయ్యాడు. విరాట్‌ కోహ్లి (45), అక్షర్‌ పటేల్‌ క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే 22.1 ఓవర్లలో 124 పరుగులు చేయాల్సి ఉంది. 

  • 22 ఓవర్లు పూర్తి .. టీమిండియా122/2

22 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్‌ 2 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ (33), కేఎల్‌ రాహుల్‌ (15) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. అంతకు ముందు ఉన్నారు. రోహిత్‌ శర్శ 30 పరుగులు చేసిన రోహిత్‌ శర్శ సీన్‌ అబాట్‌ బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటవ్వగా, ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (37) ఎల్బీడబ్యూ ఔట్‌ అయ్యాడు.

  •  గిల్‌ (37) ఔట్‌.. టీమిండియా77/2

77 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (37) ఎల్బీడబ్యూ ఔట్‌ అయ్యాడు. కోహ్లి (8), కేఎల్‌ రాహుల్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

  • 11 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 74/1

270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 11 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 74 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్‌ గిల్‌(36), కోహ్లీ (8) పరుగులతో ఉన్నారు.

  • రోహిత్‌ 30 ఔట్‌

లక్ష్య చేధనలో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌ శర్శ 30 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. సీన్‌ అబాట్‌ బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ ఔటాయ్యడు. క్రీజులోకి కోహ్లీ వచ్చాడు. శుబ్‌మన్‌ గిల్‌ (33) పరుగులలో క్రీజులో ఉన్నాడు.

  • 6 ఓవర్లలో 31

6 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్‌ 31 పరుగులు చేసింది. శుభ్‌మాన్‌ గిల్‌ (22), రోహిత్‌ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • భారత్‌ టార్గెట్‌ 270 పరుగులు

టాస్‌ గెలిచిన తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటై.. భారత్‌ టార్గెట్‌ 270 పరుగులుగా నిర్ధేశించింది. ఆసీస్‌ బ్యాటర్లలో మిచెల్‌ మార్ష్‌(47), కారీ(38), హెడ్‌(33), పరుగులతో రాణించారు. వార్నర్‌(23), లబుషేన్‌(28), మార్కస్‌ స్టోయినిస్‌ (25), సీన్‌ అబాట్‌ (26), ఆగర్‌ (17), స్టార్క్‌ (10), జంపా (10) విలువైన పరుగులు జోడించి ఆసీస్ ను ఆదుకున్నారు.  టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3, కుల్దీప్ యాదవ్ 3, మహ్మద్ సిరాజ్ 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు సాధించారు.

 

  • కుల్‌దీప్‌కు 3వ వికెట్‌.. ఆస్ట్రేలియా 203/7

మూడో వన్డేలో స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ విజృంభిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో తన 3వ వికెట్‌ను తీసుకున్నాడు. 23 పరుగులు చేసిన క్యారీని క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 203/7 ఉంది. క్రీజులో సీన్‌ అబాట్‌, ఆగర్‌ ఉన్నారు.

  • 6 వికెట్‌ డౌన్‌

ఆస్ట్రేలియ 6 వికెట్‌ను కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో మార్కస్‌ స్టోయినిస్‌ శుభ్‌మాన్‌గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఆసీస్‌ 196/6 ఉంది. క్రీజులో సీన్‌ అబాట్‌, క్యారీ ఉన్నారు.

 

  • 35 ఓవర్లు పూర్తి.. ఆస్ట్రేలియా 185/5

35 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా 185 పరుగలు చేసింది. స్టోనిస్‌, క్యారీ వికేట్‌ పడకుండా స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్తున్నారు. అంతకు ముందు ట్రావిస్‌ హెడ్‌ (33), స్టీవ్‌ స్మిత్‌ (0),మిచెల్‌ మార్ష్‌ (47)ను పాండ్యా ఔట్‌ చేయగా, వార్నర్‌(23), లబుషేన్‌(28) ను కుల్‌దీప్‌ ఔట్‌ చేశాడు.

  • ఐదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

లబుషేన్‌ రూపంలో ఆసీస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి లబుషేన్‌(28) పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం ఆసీస్‌ స్కోరు 138/5. స్టొయినిస్‌, క్యారీ క్రీజులో ఉన్నారు.

  • వార్నర్‌ ఔట్‌.. ఆస్ట్రేలియా 125/4

కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో వార్నర్‌(23) ఔటయ్యాడు. కుల్‌దీప్‌ వేసిన బంతిని తప్పుగా అచంనా వేసిన వార్నర్‌ పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్‌ లాబుస్చాగే, అలెక్స్‌ కారీ క్రీజులో ఉన్నారు.

  • 20 ఓవర్లు పూర్తి.. ఆస్ట్రేలియా 106/3

20 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి106 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్‌, లబుషేన్‌ ఉన్నారు. అంతకు ముందు పాండ్యా 3 ఓవర్లలో మూడు వికెట్లు తీశాడు. తొలుత ఆసీస్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ (33)ను అవుట్‌ చేసిన పాండ్యా... ఆ తర్వాత కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (0)ను డకౌట్‌ చేశాడు. ఆ వెంటనే మిచెల్‌ మార్ష్‌ (47)ను పాండ్యా ఓ చక్కటి బంతితో బోల్తా కొట్టించాడు. దాంతో ఆసీస్‌ కేవలం 17 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

 

  • పాండ్యాకు 3 వికెట్లు.. ఆస్ట్రేలియా 85/3

హార్దిక్‌ పాండ్యా తన వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ ఆస్ట్రేలియాపై ఓత్తిడి పెంచుతున్నాడు. ముందు ట్రావిస్‌ హెడ్‌, స్మిత్‌ను ఔట్‌ చేసిన పాండ్యా ఆ తరువాతి ఓవర్‌లో మార్ష్‌ (47) క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ప్రస్తుతం క్రీజులో వార్నర్‌, లంబుషేన్‌ ఉన్నారు.

  • స్మిత్‌ డక్‌ ఔట్‌.. ఆస్ట్రేలియా 74/2

హార్దిక్‌ పాండ్యా తన రెండో ఓవర్‌లో స్మిత్‌ను ఔట్‌ చేశాడు. 3 బంతులు ఆడిన స్మిత్‌ పరుగులేమి చేయకుండి పెవిలియన్‌కు చేరుకున్నాడు. స్మిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్‌ కిపర్‌ కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా అందుకున్నాడు. వన్డేలో స్మిత్‌ను హార్దిక్‌ పాండ్యా ఔట్‌ చేయడం ఇది 5వ సారి.

 

  • హెడ్‌ ఔట్‌.. ఆస్ట్రేలియా 68/1

68 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కోల్పోయింది. 33 పరుగులు చేసిన ట్రావిస్‌ హెడ్‌.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి స్మిత్‌ వచ్చాడు. మార్ష్‌ 40 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • 8 ఓవర్లలో ఆస్ట్రేలియా 56/0

8 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్‌ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్‌(23), హెడ్‌(32) పరుగులతో ఉన్నారు.

  • టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా..

చెపాక్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డేకు భారత్‌- ఆస్ట్రేలియా జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా రెండు మార్పులతో వచ్చింది.
తుది జట్లు
భారత్‌:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభమన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌
ఆస్ట్రేలియా: డేవిడ్‌ వార్నర్‌, ట్రావిస్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌, స్టీవెన్‌ స్మిత్‌(కెప్టెన్‌), మార్నస్‌ లాబుషేన్‌, అలెక్స్‌ కారీ(వికెట్‌ కీపర్‌), మార్కస్‌ స్టోయినిస్‌, అష్టన్‌ అగర్‌, సీన్‌ అబాట్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆడమ్‌ జంపా