Feb 01,2023 18:51

అహ్మదాబాద్‌ : అహ్మదాబాద్‌లో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు సాధించింది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ సునామీ ఇన్నింగ్స్‌ ఆడాడు. (63 బంతుల్లో 126 నాటౌట్‌, 12 ఫోర్లు, 7 సిక్సర్లు) తో దుప్పురేపాడు. టీ20 కెరీర్లో తొలి సెంచరీని సాధించాడు. తొలుత టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఇషాన్‌ కిషన్‌, గిల్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కేవలం మూడు బంతులను మాత్రమే ఎదుర్కొన్న ఇషాన్‌ ఒక పరుగు మాత్రమే చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్‌ త్రిపాఠి చేలరేగి ఆడాడు. 22 బంతులు, 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 44 పరగులు చేసి సౌధీ బౌలింగ్‌లో లాకీ ఫెర్గూసన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 24 (13 బంతులు, 2 సిక్సర్లు, 1 ఫోర్‌), హార్దిక్‌ పాండ్యా 30 (17 బంతులు, 1 సిక్సర్‌, 4 ఫోర్లు) పరుగులు సాధించారు. దీపక్‌ హుడా 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కివీస్‌ బౌలర్లలో బ్రేస్‌ వెల్‌, టిక్నర్‌, సోధి, మిచెల్‌ చెరో వికెట్‌ సాధించారు. 235 పరుగుల విజయలక్ష్యంతో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ ను ప్రారంభించింది.

  • 16 ఓవర్లు పూర్తి .. భారత్‌ 187/3

 16 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 187 పరగులు చేసింది. గిల్‌ (80), పాండ్యా (17) పరుగులపై బ్యాటింగ్‌ చేస్తున్నారు. అంతకు ముందు దాటిగా ఆడుతున్న సూర్యకుమార్‌ను బ్లయర్‌ టిక్నర్‌ బౌలింగ్‌లో మైఖేల్‌ బ్రాస్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

  • గిల్‌ 50.. భారత్‌ 112/2

సుభ్‌మాన్‌ గిల్‌ మూడో టీ 20లో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 36 బంతులు ఆడిన గిల్‌ 7 ఫోర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 112 పరగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 11 బంతులో 18 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • 87 పరుగులకు రెండు వికెట్లు

 8 ఓవర్లకు భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. 44 పరుగులు చేసిన రాహుల్‌ సౌధీ బౌలింగ్‌లో లాకీ ఫెర్గూసన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో సుభ్‌మాన్‌గిల్‌; సూర్యకుమార్‌ ఉన్నారు. అంతకు ముందు ఇషాన్‌ కిషాన్‌ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరాడు.

  • టాస్‌ గెలిచిన టీమిండియా.. తొలుత బ్యాటింగ్‌

అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇదివరకే రెండు మ్యాచ్‌ లు ముగిసిన ఈ సిరీస్‌ లో రెండు జట్లూ చెరో మ్యాచ్‌ గెలిచాయి. ఇక నేటి మ్యాచ్‌ లో ఎవరు గెలిస్తే వాళ్లదే సిరీస్‌. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లలో మార్పులు జరిగాయి. భారత జట్టులో యుజ్వేంద్ర చాహల్‌ స్థానంలో ఉమ్రాన్‌ మాలిక్‌ తుది జట్టులోకి వచ్చాడు. కివీస్‌ తరపున డఫ్ఫీ స్థానంలో బెన్‌ లిస్టర్‌ వచ్చాడు.
తుది జట్లు :
భారత్‌ :
శుభమన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ త్రిపాఠి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ మావి, కుల్దీప్‌ యాదవ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

న్యూజిలాండ్‌ : ఫిన్‌ అలెన్‌, డెవాన్‌ కాన్వే, మార్క్‌ చాప్‌మన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, డారిల్‌ మిచెల్‌, మైఖేల్‌ బ్రాస్‌వెల్‌, మిచెల్‌ శాంట్నర్‌ (కెప్టెన్‌), ఇష్‌ సోధి, బెన్‌ లిస్టర్‌, లాకీ ఫెర్గూసన్‌ ,బ్లయర్‌ టిక్నర్‌