
అంతర్జాతీయ మార్కెట్ రీసెర్చ్ సంస్థ నీల్సన్‌కు సిఈఒ గా భారతీయుడు కార్తీక్ రావు నియమితులయ్యారు. ఈయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. మరోవైపు 2018 నుంచి సిఈఒ గా ఉన్న డేవిడ్ కెన్నీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పదోన్నతి పొందారు. కార్తీక్‌రావు సుదీర్ఘకాలంగా నీల్సన్‌లోని వివిధ విభాగాల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తదితర హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. చెన్నైలనోని లయోలా యూనివర్సిటీలో డిగ్రీ (ఎకనామిక్స్) చదివిన కార్తీక్‌రావు, అమెరికాలోని ఇలినాయిస్ స్టేట్ యూనివర్సిటీలో ఎంబిఎ పట్టా పొందారు. నీల్సన్ ప్రపంచవ్యాప్తంగా 55 కంటే ఎక్కువ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.